RTI జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు రెడ్డి నియామకం

KDP: RTI కడప జిల్లా అధ్యక్షుడిగా సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామానికి చెందిన పాటూరు శ్రీనివాసులు రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్టిఐ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి నియామక పత్రం జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన ఆర్టిఐ జాతీయ అధ్యక్షులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.