పాము కాటుతో వ్యక్తి మృతి

పాము కాటుతో వ్యక్తి మృతి

W.G: మొగల్తూరు(M) కాళీపట్నం ఈస్ట్‌కు చెందిన బాలం కొండబాబు (45) అనే వ్యక్తి పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఇంట్లో హాల్లో నేలపై పడుకుని నిద్రిస్తుండగా కొండబాబు కుడి చేతిపై పాము కాటు వేసింది. దీంతో అతడిని కుటుంబ సభ్యులు నరసాపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొండబాబు మృతి చెందాడు. మృతుని సోదరుడు బాలం రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.