'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'
KMM: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ వెన్నపూసల సీతారాములు అన్నారు. శనివారం నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో DCMS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ ఛైర్మన్ ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.