'అందుబాటులో సబ్సిడీపై గడ్డి విత్తనాలు'
ADB: తాంసి మండల కేంద్రంలోని ప్రాథమిక పశు వైద్య శాలలో సబ్సిడీపై నాణ్యమైన పశుగ్రాస విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల పశు వైద్యాధికారి శ్రీకాంత్ పేర్కొన్నారు. అవసరం ఉన్న రైతులు ఈ గడ్డి జొన్న విత్తనాల కోసం మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో సంప్రదించాలని సూచించారు. పశు పోషకులు రాయితీపై లభించే ఈ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.