కేసీఆర్‌కు నోటీసులు.. 'కాంగ్రెస్ దివాళాకోరుతనమే'

కేసీఆర్‌కు నోటీసులు.. 'కాంగ్రెస్ దివాళాకోరుతనమే'

SRPT: కాంగ్రెస్‌ ప్రభుత్వం తన వైఫల్యాలను, స్కాములను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్‌కు సిట్ నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితులు, ఎఫ్‌ఐఆర్ లేకుండా విచారణ చేపట్టడం రేవంత్ రెడ్డి రాక్షసానందానికి నిదర్శనమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ కుట్రలని విమర్శించారు.