కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ మీదుగా పలు ప్రత్యేక రైళ్లు
ASF: కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. ఈనెల 9,16 తేదీల్లో చర్లపల్లి-దానాపూర్, 10,17 తేదీల్లో దానా పూర్-చర్లపల్లి, 20న సంబల్ పూర్-బెంగళూరు, 24న బెంగళూరు-సంబల్ పూర్, 21న కటక్-బెంగళూరు, 25న బెంగళూరు- కటక్ రైళ్లు నడపనున్నట్లు వివరించారు. ఈ రైళ్లు మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్‌లలో ఆగనున్నాయి.