నేడు వివిధ మండలాల్లో ఎమ్మెల్యే పర్యటన

నేడు వివిధ మండలాల్లో ఎమ్మెల్యే పర్యటన

NRML: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వివిధ మండలాల్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే సిబ్బంది తెలిపారు. ఆదివారం కడెం మండలంలోని పెద్ద బెల్లాల్‌లో జరిగే శ్రీ ఆంజనేయ మండపం పూజలో పాల్గొంటారు. తర్వాత ఖానాపూర్ మండలంలోని బాబాపూర్‌కేలో జరిగే పూజ, బోనాల ఊరేగింపులో పాల్గొంటారు. అలాగే పెంబి మండలంలో లోతోరే గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.