భూపాలపల్లి జిల్లాలో ఉద్రిక్తత
BHPL: భూపాలపల్లి జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం సీపీఐ నాయకులు కుక్కలు, కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు, మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేయడానికి లోపలికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.