'విశాఖ జోన్ కార్యాలయ భవనం పునాది పనులు పూర్తి'
AP విశాఖ రైల్వే జోన్ కార్యాలయ భవనం పునాది పనులు పూర్తయ్యాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఎర్రుపాలె-అమరావతి-నంబూర్ లైన్‌కు రూ.2,047 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. APలో రూ.70,232 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్నారు. 2009-14 మధ్య ఏపీకి ఏటా సగటు కేటాయింపులు రూ.886 కోట్లుగా ఉండేవని.. 2025-26లో రూ.9,417 కోట్లను కేటాయించినట్లు చెప్పారు.