VIDEO: వరంగల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్..!

HYD: ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వైపు వెళ్లే జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా ఉప్పల్ బస్టాండ్ వద్ద రోడ్డుపై వాహనాలు మొత్తం కిక్కిరిపోయాయి. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణపు పనులు బస్టాండ్ వద్ద ప్రారంభం కావడం, మరోవైపు రాఖీ పండుగ కావటం ముఖ్య కారణాలు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు.