'ఉచిత కుట్టు మిషన్లు తక్షణమే పంపిణీ చేయాలి'
NDL: బీసీ కార్పోరేషన్ ద్వారా మహిళలకు జీవనోపాధి కోసం ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం(ఐప్వా) డిమాండ్ చేసింది. నందికోట్కూరు మున్సిపల్ కమిషనర్ బేబీకి వినతిపత్రం అందజేశారు. పట్టణ జీవనోపాదుల కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసి 70 రోజులు అవుతున్నా, కుట్టు మిషన్లు ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో (ఐప్వా)సంఘం, మహిళలు పాల్గొన్నారు.