బస్సులో పొగలు.. తప్పిన ప్రమాదం
ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌గేట్ ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. దాసరి ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో అకస్మాత్తుగా పొగలు రావడంతో గమనించిన టోల్‌గేట్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై బస్సును ఆపేలా డ్రైవర్‌కు సంకేతాలు ఇచ్చారు. తద్వారా పెద్ద ప్రమాదం తప్పినట్లు టోల్‌గేట్ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రయాణికుల వివరాల ప్రకారం.. బస్సులోని ఎయిర్ పైప్ లీక్ అవ్వడంతో టైర్లు తీవ్రంగా వేడెక్కి పొగలు వచ్చినట్లు తెలిపారు.