నేడు పాఠశాలలకు సెలవు

PPM: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా మంగళవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ఒక రోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యగా సెలవు ప్రకటించారు.