కుంటలో పడి యువకుడు మృతి
KMR: లింగంపేట మండల కేంద్రానికి చెందిన తిదిరి నవీన్ అనే యువకుడు కుంటలో పడి మృతి చెందినట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు. రెండు రోజుల క్రితం భార్యను కలవడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన నవీన్ శుక్రవారం మధ్యాహ్నం కుంటలో మృతదేహంగా కనిపించాడు. కాలకృత్యాలకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.