VIDEO: మేడారం జాతరలో మహిళ బంగారు గొలుసు అపహరణ
MLG: మేడారం మహా జాతరలో వనదేవతల గద్దెల వద్ద మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరణకు గురైంది. సుమారు మూడు తులాల బంగారం కోల్పోయినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జాతరకు వచ్చే భక్తులు విలువైన ఆభరణాలు ధరించకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.