రిషభ్ పంత్.. నువ్వు ధోనీకి కాల్ చేయ్: సెహ్వాగ్

రిషభ్ పంత్.. నువ్వు ధోనీకి కాల్ చేయ్: సెహ్వాగ్

IPLలో పంత్ ఫామ్ ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో పంత్‌కి మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కీలక సూచనలు చేశాడు. ధోనీకి ఫోన్ చేసి సలహాలు తీసుకోవాలని చెప్పాడు. నెగిటివ్ ఆలోచనలు వస్తే దాని నుంచి బయటపడటానికి వేరేవారితో చర్చించాలని తెలిపాడు. పంత్‌కు ధోనీ రోల్ మోడల్ అని.. అందుకే, అతడికి కాల్ చేయాలని అన్నాడు. ధోనీతో మాట్లాడితే తప్పకుండా మనసు తేలికపడుతుందని పంత్‌కు సూచించాడు.