'జగన్ హయాంలో రాష్ట్రానికి తీరని నష్టం'
CTR: రాష్ట్ర విభజన సమయంలో జరగని నష్టం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్లలో జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ తెలిపారు. ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలొ ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవస్థలన్నీ నిర్వీరమయ్యాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి తిరుగమనం వైపు నడిచిందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిందన్నారు.