యుద్ధం వద్దు అంటున్న లెబనాన్ ప్రధాని

యుద్ధం వద్దు అంటున్న లెబనాన్ ప్రధాని

లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. హెజ్‌బుల్లా బలమైన కోట దహీయా, 'అల్-మనార్' టీవీ స్టేషన్ లక్ష్యంగా విరుచుకుపడటంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ దాడులను లెబనాన్ ప్రధాని తీవ్రంగా ఖండించారు. దేశం మరో భారీ యుద్ధంలోకి వెళ్లకుండా ఉండాలని, శాంతిని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.