నెల్లూరులో గంజాయి కలకలం.. ఇద్దరు అరెస్ట్

నెల్లూరులో గంజాయి కలకలం.. ఇద్దరు అరెస్ట్

నెల్లూరు రైల్వే పోలీసులు ఒడిశా నుంచి చెన్నైకి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని శుక్రవారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ మురళీధర్ తెలిపిన వివరాల ప్రకారం, వారి వద్ద నుంచి రూ. 4.50 లక్షల విలువచేసే 22. 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన రాజేశ్ వద్ద 14.5 కిలోలు, మరో మహిళ వద్ద 8 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.