WORLD RECORD: ఫ్లోరిడాలో కానోపీ ఫార్మేషన్
ఫ్లోరిడాలోని లేక్ వేల్స్‌లో ఉన్న జంప్ ఫ్లోరిడా స్కైడైవింగ్ కేంద్రంలో 20 దేశాలకు చెందిన 104 మంది స్కైడైవర్లు కలిసి కానోపీ ఫార్మేషన్‌లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది 2007లో నమోదైన 100 మంది స్కైడైవర్ల రికార్డును అధిగమించింది. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.