చిన్నారితో నదిలోకి దూకిన తల్లి
BDK: చిన్నారితో కలిసి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక కథనం మేరకు పాల్వంచకు చెందిన ఓ మహిళ తన చిన్నారితో కలిసి వంతెనపై నుంచి నదిలోకి దూకింది. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మత్స్యకారులు నదిలోకి దిగి వారిని వెంటనే కాపాడారు. అనంతరం వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.