కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటి ప్రచారం

MBNR: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా జిల్లేడు చౌదరిగుడా మండలంలోని పెద్ద ఎలికిచెర్ల గ్రామంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, సోషల్ మీడియా సభ్యులు సుమన్ తదితరులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.