కోటి సంతకాల సేకరణ విజయవంతం: పెద్దిరెడ్డి
CTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పుంగనూరు నియోజకవర్గంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైనట్లు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అందులో సంతకాలు చేసినట్టు ఆయన వెల్లడించారు. నియోజకవర్గంలో సుమారు 72,500 మంది సంతకాలు చేశారని పేర్కొన్నారు.