అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతుల మృతి..!

అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతుల మృతి..!

కరీంనగర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగపూర్ గ్రామంలో సింగిరెడ్డి కొమరారెడ్డి (85), చిలకమ్మ (80) దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వృద్ధులతోపాటు కుమారుడు, కోడలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలకు ఏర్పాటు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.