వీధి కుక్కల దాడికి గురైన మరో విద్యార్థి
GNTR: నల్లచెరువుకు చెందిన షేక్ మొహిన్ అక్రమ్ అనే 7 ఏళ్ల విద్యార్థిపై ఇవాళ తెల్లవారుజామున వీధి కుక్కలు దాడికి తెగబడ్డాయి. కుక్కల దాడిలో గొంతు వద్ద తీవ్రమైన గాయాలు కావడంతో తల్లిదండ్రులు జీజీహెచ్‌కు తరలించారు. నల్లచెరువు ప్రాంతంలో ఈ వరుస ఘటనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు జీఎంసీ వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు నల్లచెరువు వాసులు హాజరవుతామని పేర్కొన్నారు.