VIDEO: అందెశ్రీ చివరి పూజ వీడియో వైరల్

VIDEO: అందెశ్రీ చివరి పూజ వీడియో వైరల్

HYD: కవి అందెశ్రీ చివరి వీడియో వైరలవుతోంది. నిన్న సమాచార హక్కు కమిషనర్ అయోధ్యరెడ్డి ఇంట్లో నిర్వహించిన అయ్యప్ప పూజకు అందెశ్రీ హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి భోజనం చేసి నిద్రపోయారని కుటుంబీకులు తెలిపారు. ఉదయం నిద్రలేపగా స్పందించలేదని, వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.