వాహనాలను తనిఖీ చేసిన ట్రాఫిక్ ఎస్ఐ

GDWL: నేరాల నియంత్రణలో భాగంగా గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు మంగళవారం విస్తృతంగా వాహనాలను తనిఖీలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్నామని తెలియజేశారు.