ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు రన్‌వే 28 దగ్గర అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. అప్రమత్తమైన పైలట్, సిబ్బంది విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.