ముప్పు ప్రాంతాల్లో పోలీసుల పర్యటన

ముప్పు ప్రాంతాల్లో పోలీసుల పర్యటన

ప్రకాశం: ‘దిత్వా’ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా పోలీస్ వ్యవస్థ సూచించింది. ముందస్తు చర్యల మేరకు ముప్పు ప్రాంతాల్లో పోలీసులు పర్యటించారు. ప్రజల భద్రత కోసం గుండ్లకమ్మ రిజర్వాయర్, ఆలయ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగిన వెంటనే అధికారులకు తెలియజేయలని పేర్కొన్నారు.