VIDEO: కావలిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు
NLR: కావలి మద్దురుపాడు టిడ్కో గృహాలలో డీఎస్పీ శ్రీధర్, Clలు, Slలు, సిబ్బందితో కలిసి శనివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని పరిశీలించి విచారించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు ఉన్నాయా లేవా అని చూశారు. పత్రాలు లేని 26 బైకులు, 2 ఆటోలు సీజ్ చేశారు. గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా తమకు తెలియజేయాలని కోరారు. తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.