వెలగని ఐమాస్ట్ లైట్లు.. అధికారులు స్పందించండి

RR: షాద్‌నగర్ పట్టణ పరిధిలోని కేశంపేట బైపాస్ రోడ్డులో రాత్రి వేళల్లో ఐమాస్ట్ లైట్లు వెలగకపోవడంతో చీకటి అలముకుందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన ఐమాక్స్ లైట్లు చాలాకాలంగా వెలగకపోవడంతో వాహనదారులు, పాదాచారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఐమాస్ట్ లైట్లు వెలిగేలా చూడాలని కోరుతున్నారు.