నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం ఏటా ఆగస్టు 19న జరుపుకుంటారు. 1839లో 'డాగ్యురోటైప్' అనే మొదటి ఫొటోగ్రఫీ ప్రక్రియ పేటెంట్‌ను ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రపంచానికి ఉచితంగా ఇచ్చిన రోజు ఇది. ఫొటోగ్రఫీ కళ, చరిత్రను గౌరవించడం దీని ముఖ్య ఉద్దేశం. ఫొటోలు చరిత్రకు, సంస్కృతికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఈ ఏడాది 'My Favorite Photo' అనే థీమ్‌తో ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు.