శిథిలమైన కల్వర్టు.. ఇబ్బందుల్లో ప్రజలు
KNR: గన్నేరువరం మండలం జంగపెల్లి గ్రామంలో శిథిలమైన కల్వర్టు ప్రజలకు శాపంగా మారింది. పైపులు వేసి మట్టితో నింపిన రహదారి వర్షాలకు కుంగిపోవడంతో, బస్సులు, ధాన్యం లారీలు దిగబడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వెంటనే బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆర్అండ్బి అధికారులను డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఆదివారం నిరసన తెలిపారు.