సబ్ కలెక్టర్ స్మరణ రాజ్‌కు ఘన సన్మానం

సబ్ కలెక్టర్ స్మరణ రాజ్‌కు ఘన సన్మానం

ELR: ఏలూరులోని కలెక్టరేట్ ఆవరణంలో గల గౌతమి సమావేశపు హాలులో బదిలీపై వెళుతున్న నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ రాజ్‌ను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం ఘనంగా సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారంలో స్మరణ రాజ్ విధినిర్వహణ ప్రశంసనీయమన్నారు. ఇందులో ఆర్డీవోలు అచ్యుత్ అంబరీష్, రమణ, ఎస్డిసి భాస్కర్ పాల్గొన్నారు.