భైరవకోన సందర్శించిన సీఐ
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనను ఆదివారం పామూరు సీఐ శ్రీనివాసరావు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తారని కావున పర్యాటకులకు, భక్తులకు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎస్సైకి తెలిపారు. ముఖ్యంగా జలపాతం వద్ద భక్తులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.