బద్వేలులో వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలి: CPI
KDP: బద్వేల్ పట్టణంలో సీసీ రోడ్ల పనులు వెంటనే పూర్తి చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. రూ.3 కోట్ల పనులు రాజకీయ వర్గపోరు వల్ల నిలిచిపోయాయని ఆరోపించింది. ఈ మేరకు ఆర్డీవో చంద్రమోహన్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారుల పర్యవేక్షణలో పనులు కొనసాగించాలని, ప్రొటోకాల్ ప్రకారం భూమి పూజలు నిర్వహించాలని కోరారు.