హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించనున్న సీఎం రేవంత్

HYD: హైదరాబాదులో కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఈనెల 8వ తేదీన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు ఆరోజు ఉదయం 11:05 గంటలకు సీఎం రేవంత్ చేతుల మీదగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే పోలీసు వాహనాలను జెండా ఊపి ప్రారంభించనున్నారని తెలిపారు.