మున్సిపల్ కార్మికుల నిరసన

మున్సిపల్ కార్మికుల నిరసన

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయు నాయకులు మాట్లాడుతూ.. ప్రతి నెల సకాలంలో జీతాలు చెల్లించి ఆప్కోస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.