గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

NGKL: గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. అమ్రాబాద్ మండలంలోని చింతలోని పల్లి గ్రామంలో ఆయన శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.