రేపటి సీఎం జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే..!
సీఎం చంద్రబాబు రేపటి అనంతపురం జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 10.30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు వేములపాడు చేరుకుంటారు. తాడిపత్రి నియోజకవర్గంలో సాగునీటి భద్రతపై సమీక్షిస్తారు. హంద్రీనీవా కాలువ నీటి ప్రయోజనాలపై రైతులతో చర్చిస్తారు. యాడికి మార్కెట్ యార్డ్ వద్ద ప్రజా వేదికలో పాల్గొని, ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి 7.35 గంటలకు అమరావతికి వెళ్లనున్నారు.