VIDEO: ఫేక్ ఫోన్ పే యాప్ తో మోసం.. ఇరువురికి దేహశుద్ధి
MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి వద్ద ఫేక్ ఫోన్ పే యాప్‌తో చెల్లింపులు చేసిన ఇరువురిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. మేడ్చల్ స్వామి, బండ తిమ్మాపూర్ సాయి ఇరువురు దుకాణాలలో కొనుగోలు చేసి ఫేక్ ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేసినట్లు చూపించి వెళ్లిపోతున్నారు. రాత్రి కూడా అలాగే చేయడంతో గుర్తించి పట్టుకొని దేహ శుద్ధి చేశారు.