BIG ALERT.. జిల్లాకు వరద ప్రవాహం..!
W.G: మొంథా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలలో రేపు ఉదయం లోపు ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.