రహదారిపై గ్రామస్తుల ఆందోళన
NZB: మాక్లూర్ (M) మామిడిపల్లి గ్రామస్తులు శనివారం రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వెంటనే పూర్తి చేసి ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. అసంపూర్తిగా నిర్మాణ పనులు వదిలేయడంతో వాహన రాకపోకలు సాగించడం వల్ల విపరీతమైన దుమ్ము నివాసాల్లోకి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.