పెద్దహ్యటలో చెత్త బుట్టల పంపిణీ

పెద్దహ్యటలో చెత్త బుట్టల పంపిణీ

KRNL: హోలగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో బుధవారం ఇంటింటికీ చెత్త సేకరణ బుట్టలను పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తను వేర్వేరు బుట్టల్లో వేయాలని, పారిశుధ్య కార్మికులకు సహకరించాలని గ్రామస్థులను కోరారు.