సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన సర్పంచ్

సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన సర్పంచ్

WGL: చెన్నారావుపేట మండలంలోని ఎల్లయ్యగూడెం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ జినుకల కనకమల్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని స్పష్టం చేశారు.