పోలింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన వృద్ధుడు
RR: పోలింగ్ కేంద్రం వద్ద ఓ వృద్ధుడు కుప్ప కూలిన ఘటన చేవెళ్ల మండలం ఆలూరులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బుచ్చయ్య (70) అనే వృద్ధుడు ఓటు వేసి బయటకు రాగానే అకస్మాత్తుగా కుప్పకూలాడు. అతడిని ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు తెలిపారు. కాగా, తన కుమార్తె వార్డు మెంబర్‌గా పోటి చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.