బాధితురాలికి రూ.1.50 లక్షల CMRF చెక్కు అందజేత
ప్రకాశం: దర్శి పట్టణానికి చెందిన పొద్దుటూరి రసూల్‌బి అనారోగ్యంతో బాధపడుతుండటంతో విషయం తెలుసుకున్న దర్శి టీడీపీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు CMRF ద్వారా ఆర్థిక సాయం చేశారు. రూ.1.50 లక్షల చెక్కును వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. CMRF పేదలకు వరం లాంటిదని పేర్కొన్నారు.