రేపు బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణికుల సేవా దినోత్సవం

HYD: బేగంపేట విమానాశ్రయంలో రేపు ప్రయాణికుల సేవా దినోత్సవం నిర్వహించనున్నట్లు ఎయిర్ పోర్ట్ కో-ఆర్డినేషన్ ఇన్‌ఛార్జ్ అచింత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు, పిల్లల కోసం పెయింటింగ్ పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా విద్యార్థులకు విమానయాన రంగంలోని ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.