నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

JGL: జగిత్యాల రూరల్ మండలంలోని తక్కళ్లపల్లి 11కేవీ ఫీడర్ పరిధిలో లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించనున్నారు. ఈ కారణంగా నేడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పొలాస సెక్షన్ ఏఈ బీ.సుందర్ తెలిపారు. దీని వలన తక్కళ్లపల్లి, అనంతారం, గుట్రాజ్ పల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు.