జగ్గయ్యపేటలో గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం
NTR: జగ్గయ్యపేటలోని గౌరవరం పంచాయతీ పరిధిలో గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. జేఆర్ ఏకో కెమికల్ కర్మాగారంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి కెమికల్ ప్లాంట్లోని షెడ్డు కూలిపోయింది. అదృష్టవశాత్తు, సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.